"Such a scandalous state of things is a disgrace to society, and literature can not have a higher function than to show up such practices and give currency to a high standard of moral ideas. Until reading habits prevail among masses, one must look only to the stage to exert such healthy influence."
-Sri Gurajaada Venkata Apparao Pantulu,
First Preface to Kanyasulkam, c.1892
తెలుగు భాష ను గ్రాంధికం నుంచి వ్యవహారికం వైపు పరిగెత్తించిన వారిలో గురజాడ వారి స్థానం చిరస్మరణీయం. 1892 లో వారు వ్రాసిన 'కన్యాశుల్కం' బహుశా తెలుగు లో అత్యంత ప్రజాదరణ పొందిన తొలి సాంఘిక నాటకం. హిందూ మతంలో కొన్ని వర్గాలలో పరిఢవిల్లుతున్న ఆడపిల్లలను అమ్ముకునే దురాచారం పై కలం తో వారు ప్రకటించిన యుద్ధం గానే చెప్పుకోవాలి ఈ నాటకాన్ని. అసలు మత విషయాలలో జోక్యం మనకెందుకులే అని బ్రిటిష్ ప్రభుత్వం నాడు అనుకుంటున్నా, చాందసులు వ్యతిరేయకంగా వితండ వాదం చేస్తున్న , ఈ నాటకం ద్వారా, కొంత వ్యంగం తో, జనాల్ని చైతన్యవంతులను చేశారు గురజాడ వారు.
కన్యాశుల్కం రాసి, ఈ ఆగష్టు మాసం తో 125 ఏళ్ళు గడిచాయి. అయితే అప్పటి పరిస్థితులు వేరు అయినా, ఈ నాటకం, అందులో పాత్రలను ఎప్పటికి మరచిపోలేము.
It is women that seduces all mankind అని గొప్పలకి పోయే మేకవన్నె పులులైన మాస్టర్ గిరీసాలు మనకు కద్దే కదా.
విషయం ఏదైనా , కారణం వున్నా లేకపోయినా, తప్పు ఆడవాళ్లదే అనే అగ్నిహోత్రావధానులు వంటి ఉద్ధండులు మనకు అన్ని ప్రాంతాలలో, అన్ని మతాల లో అన్ని వేళలా కనిపిస్తారు, వినిపిస్తారు (ఉదా - Talaq e Biddat)
నమ్మి మోసం చేసే రామప్ప పంతులు మన పొరుగింట్లోనో, మిత్రుడు రూపం లోనో ఎదురవుతువునే వుంటారు.
నేను ఇంటర్మీడియట్ లో ఉండగా ఒకసారి చదివిన 'కన్యాశుల్కం', కేవలం 125 ఏళ్ళు కాదు, తెలుగు భాష ఉన్నంత వరుకు వర్ధిల్లుతుంది!
Book - 'కన్యాశుల్కం' (c.1892 & 2nd Version - c.1909) by Sri Gurajaada Venkata Apparao Pantulu
Link - https://en.wikipedia.org/wiki/Kanyasulkam
Book - 'కన్యాశుల్కం' (c.1892 & 2nd Version - c.1909) by Sri Gurajaada Venkata Apparao Pantulu
Link - https://en.wikipedia.org/wiki/Kanyasulkam
No comments:
Post a Comment