Search This Blog

Friday, May 11, 2018

మహానటి

(Warning - Spoiler Alert) 
                                 
             

"నేను ఏమి అంత పెద్ద మహానటి ని కాదు లెండి.ముందు కెమెరా లేకపోతే నాకు బొత్తిగా నటించడం రాదు."                                                     - 'మహానటి ' సావిత్రి గారు

ఏదో చిన్నప్పుడు 'మిస్సమ్మ ', 'మాయాబజార్ ' సినిమాలు చూడడం తప్ప ఆ మహానటి గురించి నాకు ఏమి తెలియదు. ఏ నటీమణి కి లేనంత ఖ్యాతి గడించిన సావిత్రి గారు చివర్లో ఎన్నో కష్టాలు పడి , 45 ఏళ్ళ కే స్వర్గస్తులవ్వడం జగద్విదితం. అప్పుడప్పుడు TV లో వచ్చే పాత సినిమాలు చూస్తే చాలు, ఆవిడ గొప్ప నటనా కౌశలం తెలుస్తుంది. ఈ దృష్టి తోనే నేను ఈ సినిమా చూసాను. ఆవిడ చాలా మంచి మనిషి కూడా. ఎముక లేని చెయ్యి. నాగ్ అశ్విన్ (దర్శకుడు) చాలా బాగా తీశారు. చాలా సన్నివేశాల లో కళ్ళు చెమర్చాయి. ఆ మహానటి గా కీర్తి సురేష్ అద్భుతంగా సరిపోయారు. దుల్క్ఆర్ సల్మాన్ జెమినీ గణేశన్ గా పండించారు. ఇంక మిగిలిన పాత్రల గురించి ఏమని చెప్పేది ? సమంత జర్నలిస్ట్ మధురవాణి గా, విజయ్ ఏమో  ఆంటోనీ గా సరిపోయారు. చాలా పెద్ద నటులందరూ వారి వారి పాత్రలకు ఎంతో చక్కగా న్యాయం చేశారు.

1940 ల నుండి 1980 ల వరుకు జరిగే ఈ గాధ లో సందర్భానుసారంగా, ఆ మహానటి జీవిత ఒడిదుకులను ఆవిష్కరించారు. విజయ వాహిని స్టూడియో లో మాయాబాజార్ సెట్, మద్రాస్ నగర అప్పటి ట్రామ్ వ్యవస్థ, బెజవాడ లో నాటకాల క్రేజ్, గోల్డస్పాట్ డ్రింక్స్, అంబాసిడర్ కార్లు, - ఇలా ఎంతో జాగ్రత్తగా అప్పటి కాలాన్ని చూపించారు (Historical Accuracy).

మచ్చుకకి హృదయానికి హత్తుకునే ఆణిముత్యాలు -
1. ఎందరో  ఆర్ధికముగా మోసం చేసి, ఆవిడని వదిలేస్తే, ఆస్తులు జప్తు చేసిన ఇన్కమ్ టాక్స్ ఆఫీసరే 'ఆటోగ్రాఫ్ ' కోరితే నవ్వుతు ఇచ్చిన ఘనత ఆవిడది.
2. 'ఉన్నది ఒక జన్మే అయితే ...' అంటూ జెమిని గణేశన్ గారి తో జరిగే ఒక సంభాషణ.
3. పెద్దాయన ఎస్.వి.రంగారావుగారు చివర్లో 'ఎమ్మా, భొచేసావా ' అని ఆ మహానటి ని పలకరించే సన్నివేశం.
(హాలు లో ఎవరో ఉల్లిపాయలు తిరుగుతున్నట్టు గా అనిపిస్తుంది .)
ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో...

ఇంత గొప్ప సినిమా గురించి ఎంత చెప్పినా, ఇలాంటి గొప్ప దృశ్య కావ్యాన్ని ఎన్ని సార్లు చుసినా తనివి తీరదు. 




Film - 'Mahanati' (Telugu) by Nag Ashwin, 2018. https://www.imdb.com/title/tt7465992/

No comments:

Post a Comment